పవన్ ఫ్యాన్స్ కి అంత సీన్ లేదు : ఆర్జీవీ సంచలన కామెంట్స్

Thursday, April 26th, 2018, 11:46:33 AM IST

శ్రీరెడ్డి ఇష్యూలో తనకు తాను సరెండర్ అయిపోయి బాగా బద్నాం అయ్యాక కూడా వర్మ దేనిని లెక్క చేయటం లేదు. తన మానాన తాను ట్వీట్లు పెట్టుకుంటూ పవన్ కు కౌంటర్లు వేస్తూ అలా కానిచ్చేస్తున్నాడు. మే 25న నాగార్జునతో చేసిన ఆఫీసర్ విడుదల ఉన్న నేపధ్యంలో ప్రమోషన్ వేగం పెంచాల్సిన టైం వచ్చింది. దాంతో పాటుగా కొందరు పవన్ ఫాన్స్ ఎలాగైనా ఆఫీసర్ సినిమాను దెబ్బ తీస్తామని వసూళ్లు రాకుండా అడ్డుకుంటామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో వర్మ ధీటుగా బదులిస్తున్నాడు. పవన్ ఫాన్స్‌ని యూ ట్యూబ్ అలెగ్జాండర్స్ అని సంభోదించిన వర్మ… ఆఫీసర్‌ని నిలవరిస్తామని చెబుతున్న వాళ్ళకు గట్టి సమాధానమే చెబుతున్నాడు. ఎవరెన్ని మాటలు అన్నా తగ్గేది లేదు అనే రీతిలో వ్యవహరిస్తున్న వర్మ అంతకంత పవన్ మీద ట్వీట్లు వేయటం మానుకోవడం లేదు. పవన్ పెట్టిన ప్రతి ట్వీట్ కో కౌంటర్ సిద్ధం చేస్తున్నాడు.

ఇక పవన్ ఫాన్స్ గురించి చెబుతూ అజ్ఞాతవాసి కలెక్షన్స్ పెంచలేనివాళ్ళు నా ఆఫీసర్ సినిమా వసూళ్లు ఎలా తగ్గిస్తారు అంటూ కార్నర్ చేసే కొశ్చన్ అడిగేసాడు. ఆ ఛాన్స్ లేదని తేల్చిపారేసాడు. తన మీద నిషేధం లాంటి చర్యలు కూడా అసాధ్యం అంటున్న వర్మ ఆఫీసర్ విడుదల కాగానే అఖిల్ తో సినిమా కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. శ్రీరెడ్డి ఉదంతం తర్వాత వర్మతో తెలుగు నిర్మాతలు సినిమాలు చేస్తారా అనే అనుమానం ఉన్న నేపధ్యంలో అఖిల్ తో మూవీ ఉంటుంది అని చెప్పటం కొత్త ట్విస్ట్. వర్మ మీద ఆగ్రహంతో ఉన్న మెగా ఫ్యామిలీకి నాగ్ అత్యంత సన్నిహితంగా ఉండే స్నేహితుడు. అలాంటిది వర్మకు మరో సినిమా అవకాశం ఇస్తాడు అనుకోలేం. కాని వర్మ మాత్రం ఉండి తీరుతుంది అంటున్నాడు. తన మీద చర్యలు తీసుకోవడానికి కారణమే లేనప్పుడు ఇక దాని గురించి మాట్లాడ్డం కూడా అనవసరం అంటున్న వర్మకు ఆఫీసర్ సక్సెస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. మరి ఆఫీసర్ ఎంతవరకు వర్మను గార్డ్ చేస్తాడో మే 25 చూడాలని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments