ఆఫీసర్ ట్రైలర్ : వర్మ దింపాడుగా!

Saturday, May 12th, 2018, 05:17:19 PM IST

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చాలా కాలం తరువాత నాగార్జున తో కలిసి చేసిన సినిమా ఆఫీసర్. ఈ సినిమా ఎంతవరకు విజయాన్ని అందుకుంటుంధో గాని వర్మ మాత్రం ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతున్నాడు. ఇప్పటికే టీజర్ బాగా వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్ లైక్ కొట్టారని సోషల్ మీడియాలో వర్మ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సినిమా ట్రైలర్ ని వర్మ రిలీజ్ చేశాడు. వర్మ మార్క్ యాక్షన్ మాఫియా సినిమాలో బాగానే కనిపిస్తున్నాయి. ఇంతవరకు ఎప్పుడు లేని విధంగా నాగార్జునను కొత్త తరహాలో చూపించాలని వర్మ ట్రై చేసినట్లు తెలుస్తోంది. అలాగే కూతురు సెంటిమెంట్ – యాక్షన్ ఫైట్స్ – గ్లామర్ అంశాలను కూడా తనదైన శైలిలో వర్మ చూపించాడు. ట్రైలర్ అయితే ఓ విధంగా కొత్తగానే ఉన్నా సినిమా అభిమానులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అయితే ట్రైలర్ కు అన్ లైకులు కూడా బాగానే వస్తున్నాయి.