హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్న నటుడిని సంజయ్ దత్ కొట్టడానికి వెళ్లాడా..?

Thursday, January 19th, 2017, 01:37:42 PM IST

Rishi-Kapoor
బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ తన ఆత్మ కథ ఖుల్లామ్ ఖుల్లా లో వివాదాస్పద విషయాలను వెల్లడించారు.తనకు పలువురు బొల్లి వుడ్ హీరోయిన్లతో ఎఫైర్ ఉందని వచ్చిన పుకార్లను అందులో వెల్లడించాడు.తనకు వివాహం కాక ముందు హీరోయిన్ టీనా మునిమ్ తో ఎఫైర్ ఉన్నట్లు వచ్చిన వార్తల గురించి రిషి కపూర్ తన ఆత్మకథలో ప్రస్తావించారు.ఆ విషయం లో సంజయ్ దత్ తనని అనుమానించే వాడని వెల్లడించారు. కానీ టీనా మునిమ్ మాత్రం సంజయ్ దత్ పట్ల ఆకర్షితురాలైందని వెల్లడించారు.

కానీ మీడియా, బాలీవుడ్ లోని కొందరు తనకు, టీనా కు మధ్య ఎఫైర్ నడుస్తోందని భావించారని అన్నారు. ఈ విషయం సంజయ్ దత్ కు తెలిసిన తరువాత అతడు తనతో గొడవ పడ్డానికి వచ్చాడని అన్నారు. తాను నీతూ ఇంట్లో ఉండగా సంజయ్ తనతో గొడవ పడడానికి వచ్చాడని మాఇద్దరి మధ్య వివాదం జరగకుండా నీతూ అడ్డుకుందని రిషి కపూర్ వెల్లడించారు.తనకు, టీనా కు మధ్య ఎఫైర్ లేదన్న విషయాన్ని నీతూ సంజయ్ కు చెప్పి నమ్మించిందని అన్నారు. తనకు , టీనాకు మధ్య ఎఫైర్ లేదని వారిద్దరూ కోస్టార్ లుగా స్నేహంగా ఉంటారని సంజయ్ తో నీతూ చెప్పింది. అంతటితో ఆ వివాదం సమసిపోయిందని రిషికపూర్ అన్నారు. ఈ ఘటన జరిగాకే తాను నీతూని వివాహం చేసుకున్నానని రిషి కపూర్ వెల్లడించారు. వివాహం తరువాత కూడాతనకు డింపుల్ కపాడియా తో ఎఫైర్ ఉన్నట్లు కూడా పుకార్లు వచ్చాయని అదంతా అవాస్తవమని రిషికపూర్ తన ఆత్మకథ లో పేర్కొన్నాడు.