బాల‌య్య ఇంటికే స్కెచ్ వేసిన డేంజ‌ర‌స్ థ‌గ్‌!!

Friday, September 28th, 2018, 04:01:40 PM IST

వీడు దొంగ‌ల‌కు దొంగ‌. గ‌జ‌దొంగ‌.. అత‌డు స్కెచ్ వేస్తే మామూలుగా ఉండ‌దు. కోడ్తే కుంభాన్నే కొట్టాలి అన్న‌ట్టు ఉంటుంది. అత‌డి టార్గెట్ ఓన్ల సంప‌న్నులే. జాబితాలో ఏ రేంజు వాళ్లు ఉన్నారు? అంటే డీజీపీలు, రిటైర్డ్ ఆఫీస‌ర్లు, డాక్ట‌ర్లు..ఇలా పెద్ద పెద్దోళ్లే. ఈసారికి మాత్రం సినీసెల‌బ్రిటీని దోచేయాల‌ని క‌సి పెంచుకున్నాడు. ఇంత‌కీ ఎవ‌రికా ఛాన్స్ అంటే ఇంకెవ‌రు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌. అస‌లే అత‌డు ఎమ్మెల్యే కం హీరో కాబ‌ట్టి నిధులు బాగా పార‌తాయ‌నేది అత‌డి ఆలోచ‌న అట‌.

అస‌లింత‌కీ ఎవ‌డీ డేంజ‌ర‌స్ థ‌గ్‌? ఏమా గ‌జ‌దొంగ క‌థాక‌మామీషు? అంటారా.. పేరు క‌ర్రి రాజేస్ అలియాస్ స‌త్తిబాబు, అలియాస్ బుజ్జి. ఇతడో ఘ‌రానా దొంగ‌. చేస్తే పెద్ద లెవ‌ల్ దొంగ‌త‌నాలే కానీ, చిల్ల‌ర దొంగ‌త‌నాలు చేయ‌డు. కార్మిక క‌ర్ష‌కుల జోలికి అస‌లే వెళ్ల‌డు. ఓన్లీ సంప‌న్నులే అత‌డి టార్గెట్. అక్క‌డ అయితేనే భారీగా బంగారు వ‌జ్రాభ‌ర‌ణాలు, క‌రెన్సీ నోట్లు దొరుకుతాయ‌నేది అత‌డి వాద‌న‌. ఇప్ప‌టికే బంజారాహిల్స్‌లోని ప‌లువురు సంప‌న్నుల ఇళ్ల‌లో చోరీలు చేశాడు. బెంగ‌ళూరులో దొంగ‌త‌నం చేసి ప‌ట్టుబ‌డి జైలుకెళ్లిన స‌తీష్ .. ఓ విచార‌ణ నిమిత్తం సీసీ ఫుటేజ్‌ని పరిశీలిస్తుంటే పోలీసుల‌కు చిక్కాడు. చివ‌రికి ఏదోలా జైలు కెళ్లి మ‌రీ స‌ద‌రు దొంగ‌ను ప‌ట్టేశారురు. ఈసారి బాల‌య్య ఇంటికే క‌న్నం వేసి త‌న పాపులారిటీని పెంచుకోవ‌చ్చని భారీ స్కెచ్ వేశాన‌ని స‌తీష్ విచార‌ణ‌లో చెప్ప‌డంతో పోలీసుల‌కు దిమ్మ తిరిగిపోయిందిట‌. అయితే అత‌డి నెక్ట్స్ టార్గెట్ ఛేదించ‌క‌ముందే పోలీసుల‌కు దొరికిపోయాడు .. షిట్‌!!