ఇకపై కాల్ సెంటర్లలో రోబోలు: గూగుల్ కొత్త టెక్నాలజీ!

Friday, July 27th, 2018, 12:09:43 PM IST

ఇప్పటివరకు ఏవైనా రంగాల్లో కానీ, మనం వాడే వస్తువులు, ఇతరత్రా వ్యవహారాల్లో ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ కాల్ సెంటర్ వారికీ కాల్ చేసి మన సమస్యల తాలూకు అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ఉండేవారం. దానికి సంబందించిన సిబ్బంది మనతో ఇంటరాక్ట్ అయి సమాధానాలు ఇవ్వడం మనకు తెలిసిందే. అయితే గూగుల్ సంస్థ త్వరలో (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సు ఏఐ) అంటే కృత్రిమ మేధను ఇకపై కాల్ సెంటర్లలో వివిధ సేవలకు వినియోగించనున్నారు. అంటే ఇకముందు మనం ఎప్పుడైనా కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే ఈ కృత్రిమ మేధలు వాటంతట అవే కాల్స్ స్వీకరించి కస్టమర్ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తాయి. అయితే వాటిటీకి అర్ధం కానీ, మరియు పరిష్కరించలేని కాల్స్ వచ్చిన పక్షంలో వాటిని వాటంతట ఆవే కాల్ సెంటర్ ఉద్యోగికి బదిలీ చేయబడతాయి. దీనివల్ల విధులు మరింత సులభతరం, మరియు వేగవంతం అవుతాయని గూగుల్ సంస్థ చెపుతోంది.

సిస్కో, జెనెసిస్ తదితర భాగస్వాములతో కలిసి ఈ కృత్రిక మేధను అతి త్వరలో తయారు చేసి అన్ని సేవల విభాగాల్లోనూ వినియోగించేలా యోచిస్తున్నట్లు గూగుల్ సంస్థ చెపుతోంది. అయితే ఈ రకమైన విధానం అమలు వలన డేటా గోప్యంగా ఉండడమే కాదు, నిర్వహణ పనులను కూడా చాలావరకు ఎటువంటి సమస్యలు లేకుండా చేపట్టే అవకాశం ఉంటుందని అంటున్నారు. చిల్లర వ్యాపారం నుండి మొదలెట్టి, వ్యవసాయం, ఉద్యోగం, ఆర్ధిక, కమ్యూనికేషన్ తదితర రంగాల్లో వీటిని ప్రవేశపెట్టాలని చూస్తున్నారట. రాబోయే రోజుల్లో దాదాపుగా ప్రతి రంగానికి ఏఐ ద్వారా సాధికారతను సాధించడమే తమ ద్యేయమని గూగుల్ చెపుతోంది. అయితే ప్రస్తుతానికి ఈ ఏఐ విధానాన్ని ప్రయోగాత్మకంగా తమ భాగస్వాములతో ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని, ఏవైనా సమస్యలు తెలెత్తితే వాటిని సరిచేసుకున్నాక పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకువస్తామని సంస్థ సీఈఓ తెలిపారు….

  •  
  •  
  •  
  •  

Comments