రోజు రోజుకి పెరుగుతున్న రోబోల వినియోగం – ఎటు దారి తీస్తుందో..!

Monday, April 1st, 2019, 10:02:43 AM IST

రోజు రోజుకీ పెరుగుతున్న సాంకేతికత మనిషికి ఆదా చేస్తూ జీవన ప్రమాణాలు పెంపొందించడంలో ఎంతగానో తోడ్పుతుంది.ఈ మధ్య కాలంలో టెక్నాలజీలో పెనువిప్లవం తీసుకొస్తోంది ఏదైనా ఉంది అంటే అది రోబోటిక్స్ అనే చెప్పాలి, ఆ మద్యన “ఐకియా” సంస్థలో ఫర్నిచర్ చేయటానికి రోబో వాడితే ఆశ్చర్య పోవటం మన వంతయ్యింది. ఇప్పుడు ఏకంగా రోబోలు నిర్మాణ రంగంలోకి, అందునా కార్మికుల స్థానంలోకి చొరబడ్డాయి, మానవ ప్రమేయం లేకుండానే బరువైన కట్టడాలను సైతం నిర్మిస్తూ మానవాళికి సవాలు విసురుతున్నాయి. ఇటీవల జపాన్ కు చెందిన ఒక కంపెనీ లాంచ్ చేసిన రోబో గౌడౌన్లలో కార్మికులు చేసే పనులను సునాయాసంగా మనిషి కంటే వేగంగా చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది.

సాంకేతికత పెరగటం అన్నది మనిషికి లాభమే అయినప్పటికీ అది మానవాళిని సాశించే స్థాయికి చేరటం అన్నది మనిషి ఉపాధికి ప్రమాదకరం అయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పుడు ఇదే రోజు కూలీ కార్మికుల స్థానంలో గనక రోబోల వినియోగం ఉపందుకుంటే ఆ రంగంలో జీవనోపాధి పొందుతున్న వారికి తీవ్ర స్థాయిలో ఉపాధి కొరత ఏర్పడే ప్రమాదం దగ్గరలోనే ఉందనేది కాదనలేని సత్యం. ఈ ప్రమాదాన్ని అధిగమించాలి అంటే మనిషి జీవితంలో చొరబడుతున్న ఈ టెక్నాలజీని అయినా నియంత్రించాలి లేదా మనిషి జీవనోపాధికి ప్రమాదం వాటిల్లకుండా కొత్త ఉద్యోగాల కల్పన, నూతన నైపుణ్య శిక్షణ వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.