ముంబై బ్రబౌర్న్ స్టేడియంలో ఇండియా వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో రోహిత్ – రాయుడులు సెంచిరీలతో కథం తొక్కారు. రోహిత్ 162 పరుగులు చేసి అవుట్ కాగా.. రాయుడు కరెక్ట్‌గా 100 కొట్టి అవుట్ అయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియాకి రోహిత్ – ధావన్ జోడీ శుభారంభాన్ని ఇచ్చారు. అయితే ఈ జోడీ 71 పరుగులు జోడించాక.. ధావన్ 38 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక తర్వాత వచ్చిన కోహ్లీ 16 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే రోహిత్ మాత్రం విండీస్ బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో వన్డేల్లో తన 21వ సెంచరీని పూర్తి చేసుకుని మరోసారి భారీ ఇన్నంగ్స్ ఆడాడు. సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయిన రోహిత్ 162 పరుగుల చేసి అవుట్ అయ్యాడు. ఇక మరోవైపు రాయుడు కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ అవుట్ కాగానే వచ్చిన రాయుడు 81 బంతుల్లో 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్- రాయుడు ఇద్దరు విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇక ఆ తర్వాత వచ్చిన ధోనీ 23 పరుగులు చేసి ఆకట్టుకోగా.. చివరిలో జాదవ్-జడేజా తమవంతుగా మెరుపులు మెరిపించారు. ఫైనల్‌గా టీమ్ ఇండియా 50 ఓవర్లకు 377 పరుగుల భారీ టార్గెట్‌ను విండీస్ ముంగిట ఉంచింది.