కాన్పూర్ వన్డే : రోహిత్ దంచేశాడు..కోహ్లీ కుమ్మేసాడు..!

Sunday, October 29th, 2017, 07:00:22 PM IST

కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో టీం ఇండియా భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్, మరియు టీం ఇండియా మధ్య నిర్ణయత్నమక మూడో వన్డే జరుగుతున్న విషయం తెలిసిందే. టాస్ గెలిచినా కివీస్ మొదట విరాట్ సేనాని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్ ధావన్ వికెట్ ని త్వరగానే కోల్పోయినా వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మతో జతకట్టాడు. మొదట వీరిద్దరూ ఇనింగ్స్ ని మెల్లగా నిర్మించేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తరువాత న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఓ ఆట ఆదుకున్నారు. ఇద్దరూ సెంచరీలతో చెలరేగి బౌండరీల మోత మోగించారు. రోహిత్ శర్మ (147; 138 బంతుల్లో 18×4, 2×6), విరాట్ కోహ్లీ (113; 106 బంతుల్లో 9×4, 1×6) రెండో వికెట్ కు 230 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో టీం ఇండియా చక చకా వికెట్లు కోల్పోయినా ధోని 25 పరుగులు చేయడంతో భారత్ 337 పరుగుల భారీ స్కోర్ సాధించింది.