రోహిత్ రికార్డుతో టీమిండియా గెలుపు!

Monday, July 9th, 2018, 10:04:31 AM IST

ఎక్కడికెళ్లినా కూడా టీమిండియా మంచి ఆట తీరుతో విజయాలను అందుకుంటోంది. మూడు టీ20 ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరిగిన మూడవ మ్యాచ్ లో 7 వికెట్లతో గెలుపొందిన విరాట్ సేన సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో స్కోర్ బోర్డును 200 దాటించేస్తారు అనుకున్న సమయంలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో 198 పరుగులు మాత్రమే చేయగలిగారు.

ఇక 199 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విరాట్ సేన ఆదిలోనే ధావన్ వికెట్ కోల్పోవడంతో ఒత్తిడి పెరిగినట్టు అనిపించింది. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఏ మాత్రం ఉపేక్షించకుండా తన పని తాను చేసుకుంటూ స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. బౌండరీలతో సిక్సులతో మోత మోగించి 56 బతుల్లోనే సెంచరీ చేశాడు. 11 పొర్లు 5 సిక్సర్లతో 100 పరుగులు చేసి రోహిత్ నాటౌట్ గా నిలిచాడు. ఈ దెబ్బతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన మొదటి భారతీయుడిగా రోహిత్ రికార్డ్ సృష్టించాడు. అంతే కాకుండా ప్రపంచంలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొలిన్ మున్రో కి పోటీగా నిలిచాడు. ఈ న్యూజిలాండ్ ఆటగాడు కూడా టీ20 ల్లో మూడు సెంచరీలు చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments