నా కోసం కాదు మన దేశం కోసం అరవండి..”హిట్ మ్యాన్” వైరల్..!

Wednesday, October 31st, 2018, 07:02:05 PM IST

ఇప్పటికే గడిచిన నాలుగు మ్యాచుల్లో విండీస్ పై భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనను కనబర్చారు. విరాట్ మరియు రోహిత్ లు వారి అద్భుత బ్యాటింగ్ తో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.ఇప్పుడు తాజగా “హిట్ మ్యాన్” యొక్క ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.మొన్న భారత్ మరియు విండీస్ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచులో రోహిత్ భారతదేశం పై తనకున్న ప్రేమను తన అభిమానులు దగ్గర చాటుకున్నాడు.

మన జట్టు బ్యాటింగ్ ముగిసిపోయిన తర్వాత బౌండరీ లైన్ దగ్గర రోహిత్ ఫీల్డింగ్ చేస్తుండగా అతని అభిమానులు ”రోహిత్ రోహిత్” అని కేరింతలు కొడుతుండగా రోహిత్ వారి వైపు చూసి తన కోసం కాదు మన దేశం కోసం కేరింతలు కొట్టండి అంటూ తన జెర్సీ మీద ఉన్నటువంటి ఇండియా పేరును చూపిస్తూ సంకేతాలు ఇచ్చాడు.దీనితో అభిమానులు మరింత ఉత్సాహంతో ”ఇండియా ఇండియా” అని అరవడం మొదలు పెట్టారు.ఇప్పుడు ఈ వీడియో క్రికెట్ అభిమానుల్లో వైరల్ అయ్యిపోయింది.