సెంచరీని మూగజీవికి అంకితమిచ్చిన రోహిత్!

Tuesday, July 10th, 2018, 10:42:03 AM IST

ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని నమోదుచేసుకున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ అజేయసెంచరీతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఈ సెంచరీని రోహిత్ తనకు ఎంతో ఇష్టమైన సుడాన్ కి అంకితమిచ్చాడు. ఖడ్గ మృగాల్లో అత్యంత అరుదైన జాతికి చెందినది ఈ తెల్లని ఖడ్గ మృగం. ఆ జాతిలో సుడాన్ చివరిది. అయితే గత మార్చిలో 45 ఏళ్ల ఆ ఖడ్గ మృగం తనువు చాలించడంతో ప్రపంచ జంతు ప్రేమికులు తీవ్ర మనోవేదనకు లోనయ్యారు. ఇక రోహిత్ శర్మ తన మూడవ టీ20 సెంచరీని సుడాన్ కి అంకితమిచ్చాడు. మనమంతా మంచి జీవనానికి మరో మార్గం కనుగొనలేమొ అంటూ నేను చేసిన సెంచరి సుడోకు అంకితమిస్తున్నా అని రోహిత్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ పీటర్సన్ కూడా సుడాన్ మరణంపై గతంలోనే సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

  •  
  •  
  •  
  •  

Comments