రోహిత్ చెత్త రికార్డు ఇదే!

Monday, May 21st, 2018, 02:15:00 PM IST

ఐపీఎల్ లో గత కొంత కాలంగా భారత ఆటగాళ్లు చాలా వరకు రాటుదేలుతున్నారు. ప్రతి సీజన్ లో ఎదో ఒక తరహాలో రికార్డులు కొల్లగొడుతున్నారు. బ్యాట్స్ మేన్స్ అయితే సీజన్ లో మినిమమ్ 300 పరుగులు టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు సురేష్ రైనా – రోహిత్ శర్మ లాంటి యువ బ్యాట్స్ మెన్లు ప్రతి ఏడాది 300 పరుగులకు తక్కువగా చేయలేదు. కానీ ఈ ఏడాది రోహిత్ శర్మ మాత్రం చెత్త రికార్డును నమోదు చేయడం గమనార్హం. 11వ సీజన్ లో రోహిత్ 14 మ్యాచ్ లు ఆడి కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు.

రోహిత్ ఐపీఎల్ కెరీర్ లో ఇదే చెత్త రికార్డు. కెప్టెన్ గా ముంబై జట్టుకు మూడు సార్లు ఐపీఎల్ ట్రోపీలను అందించిన రోహిత్ ఈ సారి కనీసం ప్లే హాఫ్ కు కూడా జట్టును తీసుకురాలేకపోయాడు. ఆ జట్టులో రోహిత్ తప్ప దాదాపు అందరూ బాగానే రాణించారు. అత్యవసర సమయంలో రోహిత్ దారుణంగా విఫలమవ్వడంతో ముంబై అభిమానులు షాక్ అయ్యారు. చివరి మ్యాచ్ వరకు లక్కుతో వచ్చిన ముంబై చివరలో లక్ ని సరిగ్గా వినియోగించుకోలేకపోయింది. ఇక చివరకు రాజస్థాన్ రాయాల్స్ ఎవరు ఉహించనిక్ విధంగా ప్లే ఆఫ్స్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments