అలా చేస్తే టీడిపికి మద్దతిస్తాం : రోజా

Thursday, March 8th, 2018, 11:39:49 PM IST

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విరామం లేకుండా ప్రజలను ఆకర్షించే విధంగా ముందుకు వెళుతున్నాడు. అలాగే అధికార పక్ష నేతలపై ఏ మాత్రం తగ్గకుండా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. జగన్ తన పాదయాత్రతో టీడీపి పాలనలోని లోపాలను జనాలకు తెలిసేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎలాగైనా వచ్చే ఎలక్షన్స్ లో సీఎం సీటు పొందాలని టార్గెట్ పెట్టుకున్నాడు. ఇక పోతే ఆ పార్టీలోని ఎమ్మెల్యేలు ఎప్పటిలానే అధికార పార్టీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ముఖ్యంగా ఎమ్మెల్యే రోజా అయితే స్పెషల్ గా చంద్రబాబుని టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు చేస్తున్నారు. రీసెంట్ గా చేసిన విమర్శలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మీడియాతో మాట్లాడుతూ..
చంద్రబాబు ఇటలీ భాష నేర్చుకుని మరి రాష్ట్ర విభజన గురించి సోనియాతో చర్చించారు. విభజన చేయాలని సోనియాగాంధీని ఆనాడు అడిగినట్లు రోజా కామెంట్ చేశారు. అంతే కాకుండా రోజుకో మాట మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. కేంద్ర మంత్రి వర్గం నుంచి వైదొలగడం కాదు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం తెలుగు దేశం పార్టీ నేతలు పోరాడాలని అలా చేస్తే మా మద్దతు ఉంటుందని రోజా వ్యాఖ్యానించారు.