పవన్ కళ్యాణ్ లానే రోజా కూడా..!

Tuesday, September 20th, 2016, 08:26:26 AM IST

roja
ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం పాచిపోయిన లడ్డు లాంటి ప్యాకేజ్ ని ప్రకటించిందని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ వ్యాఖ్యల పై బిజెపి నేతలనుంచి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. బిజెపి నేతలు పవన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు.పవనే ఆంద్రప్రదేశ్ లో ఓ పాచిపోయిన లడ్డు అని ఏపీ బిజెపి ఇంచార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ఘాటుగా విమర్శించిన విషయం తెలిసిందే.తాజాగా వైసిపి ఎమ్మెల్యే రోజా కుడా ప్యాకేజ్ పై ఇలాటి వ్యాఖ్యలే చేశారు.సోమవారం చిత్తూరు జిల్లా కాణిపాకం లో ఆమె మీడియాతో మాట్లాడారు.

కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం ఇచ్చిన ప్యాకేజి కుళ్లిపోయిన క్యాబేజి అని వ్యాఖ్యానించారు.నెల్లూరు లు చెందిన వెంకయ్య నాయుడు, చిత్తూరుకు చెందిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు అడ్డుగా ఉన్నారని ఆరోపించారు.తాము అధికారం లోకి వస్తే ప్రత్యేక హోదా సాధించి తీరుతామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు హోదా సంజీవని కాదని అంటున్నారని అన్నారు.చంద్రబాబు, వెంకయ్య నాయుడులకు మంచి బుద్ధి ప్రసాదించాలని కాణిపాకం వినాయకుడిని కోరుకున్నట్లు ఆమె చమత్కరించారు.