కావాలనే రాజశేఖర్ పై ఆరోపణలు చేశారు: రోజా

Sunday, May 6th, 2018, 03:15:23 AM IST

సీనియర్ హీరో రాజశేఖర్ గురించి గత నెలలో కొంత మంది వివాదస్ప సంఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాజశేఖర్ సతీమణి జీవిత ఆరోపణలు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇప్పుడు రాజశేఖర్ కు మద్దతుగా వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే రోజా నిలిచారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా మాట్లాడుతూ.. ఎలాంటి తప్పు చేసిన ఇండస్ట్రీలో వెంటనే బయటకు వస్తుంది. లేదా రెండేళ్లు పట్టవచ్చు ఇంకాస్త సమయం కూడా పట్టవచ్చు.

కానీ ఫైనల్ గా నిజమనేది తెలుస్తుంది. రాజశేఖర్ ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నాళ్లవుతోంది? నేను కూడా ఆయనతో కలిసి రెండు సినిమాలు చేశాను. ఆయన సతీమణి జీవిత లేనిదే ఎక్కడికి వెళ్లరు. అలాంటి మనిషి ఇలాంటి పని చేశాడు అని అంటే ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదని రోజా వివరించారు. కావాలని ఆయనపై ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెబుతూ.. మా ఆయనతో కూడా రాజశేఖర్ గారికి మంచి స్నేహం ఉందని రోజా వివరించారు.