తా చంద్రబాబు నిర్లక్షమే.. దాచేపల్లి అందుకే వెళ్లారు: రోజా

Saturday, May 5th, 2018, 11:52:05 PM IST

ఇటీవల గుంటూరు జిల్లా దాచేపల్లిలో బాలికపై జరిగిన ఘటన కారణంగా చంద్రబాబు విచారాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా బాధితురాలిని ఈ రోజు పరామర్శించిన కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అయితే ఈ విషయంపై వైసిపి ఎమ్మెల్యే రోజా స్పందించారు. విశాఖపట్నంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఇంతకుముందు గుంటూరులో నెల వ్యవధిలోనే దాచేపల్లి లాంటి ఘటనలు ఎన్నో జరిగినా చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా స్పందించారా? అలాగే బాధితులని పరామర్శించారా? అని ప్రశ్నించారు.

వైసిపి చేస్తోన్న పోరాటాల కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగివచ్చి నేడు బాధితురాలని పరామర్శించినట్లు తెలిపారు. అంతే కాకుండా చంద్రబాబు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని తన తప్పును కప్పి పుచ్చుకోవడానికి బాధితురాలి బంధువులను పక్కనే ఉంచుకొని మాట్లాడారని చెబుతూ.. అన్యాయానికి గురైన బాలిక గురించి వివరాలు చెప్పకూడదు అనే కనీస నిబంధనలు కూడా తెలియావా అని రోజా మండిపడ్డారు. ఇక చాలా కేసుల్లో నిర్లక్ష్యం వహించారని కాల్ మని రిషితేశ్వరి కేసులోనూ సెటిల్ మెంట్ చేసినట్లు రోజా ఆరోపణలు చేశారు.