నారా బ్రాహ్మ‌ణిపై రోజా నిప్పులు

Tuesday, November 6th, 2018, 11:11:18 AM IST

తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో పొత్తులు ఎత్తుల‌ విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన కాంగ్రెస్‌, టీడీపీ తెలంగాణ‌లో పొత్తుపెట్టుకోవ‌డం జాతీయ స్థాయిలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వీరికి తోడు తెలంగాణ జ‌న‌స‌మితి, సీపీఐ కూడా జ‌త‌క‌ట్ట‌డం మ‌రింత షాక్‌కు గురిచేసింది. అయితే ఈ అనైతిక పొత్తుపై తెరాస‌తో పాటు, జ‌న‌సేన‌, వైసీపీ గ‌త కొన్ని రోజ‌లుగా తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. టీడీపీ శ్రేణుల్లోనూ ఈ విచిత్ర‌పొత్తుపై పెద‌వి విరుస్తున్నారు. అయితే ఈ పొత్తుపై వైసీపీ నేత రోజా చేపిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

టీడీపీ, కాంగ్రెస్ క‌లిసి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ‌టానికి కార‌ణం చంద్ర‌బాబు కోడ‌లు, బాల‌కృష్ణ కూతురు నారా బ్రాహ్మ‌ణి అని
రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయాంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఆ మ‌ధ్య హైద‌రాబాద్‌లో ఎంట‌ర్‌ప్రెన్యూర్స్ స‌మ్మిట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాహుల‌్ గాంధీ ప్ర‌త్యేకంగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బ్రాహ్మ‌ణి ఆ త‌రువాత రాహుల్ గాంధీతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. అప్ప‌ట్లో ఆ భేటీకి కార‌ణ‌మేంట‌న్న‌ది ఎవ‌రికీ అర్థం కాలేదు.

ఆ త‌రువాత రాహుల్‌తో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేకంగా సంభాషించార‌ని, ఆ త‌రువాతే తెలంగాణ‌లో కాంగ్రెస్, టీడీపీ కూట‌మిగా ఏర్పాటైంద‌ని రోజా మండిప‌డింది. రాష్ట్రాన్ని అశాస్త్రియంగా విడ‌గొట్టిన కాంగ్రెస్‌ని ఏపీలో భూస్థాపితం చేయండ‌ని, రాహుల్ పై చెప్పులు విస‌రండి అంటూ ఘాటుగా విమ‌ర్శ‌లు చేసిన చంద్ర‌బాబు ఇప్ప‌డు అదే రాహుల్ చెప్పులు మోస్తున్నాడ‌ని రోజా విరుచుకుప‌డింది. రోజా ఆరోప‌ణ‌లు విన్నవారంతా రోజా చెప్పిన‌ట్టు రాహుల్‌ని నారా బ్రాహ్మ‌ణి క‌లిసిన త‌రువాతే తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త పొత్త‌లు పొడ‌చూపాయ‌ని, ఈ విష‌యంలో రోజా మాట‌లు నిజ‌మ‌నే సంకేతాల్ని అందిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments