గుండు కొట్టించినోళ్ల‌ను చెప్పు తీసి కొడ‌తా! – రోజా

Saturday, October 28th, 2017, 09:25:35 AM IST

ఇటీవ‌ల నంద్యాల‌, కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైకాపా ఓట‌మిపాలైన త‌ర్వాత ఆన్‌లైన్‌లో నెటిజ‌నులు ఆ పార్టీ మ‌హిళా నేత రోజా మార్ఫింగ్ ఫోటోలు లైవ్ అయ్యాయి. గుండు కొట్టించుకున్న‌ట్టు క‌నిపించిన ఈ ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో ఓ రేంజులో వైర‌ల్ అయ్యాయి. అయితే వీటిపై రోజా అప్ప‌ట్లోనే పెద్ద రేంజులో ఫైర‌య్యారు. ఇటీవ‌లే టీవీ9 ఎన్‌కౌంట‌ర్ విత్ ముర‌ళికృష్ణ కార్య‌క్ర‌మంలో దీనిపై ఓ రేంజులో ఫైరయ్యారు రోజా. నేనేమైనా పోటీ చేశానా? నేను ఓడిపోయాను.. అంటూ ఇలా ప్ర‌చారం చేస్తారా? ఎవ‌డైతే ఈ ఫ్లెక్సీలు వేశాడో వాడిని చెప్పుతో కొడ‌తాను… అంటూ సీరియ‌స్ అయ్యారు రోజా.

తెలుగు దేశంలో ఉన్న ముఖ్యుల పెళ్లాలు, కూతుళ్ల‌కు గుండ్లు కొట్టించి ఫ్లెక్సీలు వేయ‌లేమా? మీలాగే మేమూ మారితే ఎంత నీచంగా ఉంటుంది? ఎంత వ‌ల్గ‌ర్‌గా మెసేజ్‌లు, మెయిల్స్ పెడుతున్నారంటే… ఒక అబ్బ‌కు అమ్మ‌కు పుట్టిన‌వాళ్లా ఇవి చేసేది… అంటూ కాస్త క‌ఠినంగానే ప‌ద‌జాలం ఉప‌యోగించారు. సోష‌ల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోల్ని అప్‌లోడ్ చేస్తే …. ఫిర్యాదు చేశాను ఇప్ప‌టికే. దీనికి ముందు వ‌ల్గ‌ర్‌గా చాలా వ‌ల్గ‌ర్ ఫోటోలు ఆన్‌లైన్‌లో పెట్టారు. ఇదంతా ప్ర‌త్య‌ర్థుల ప‌నే. ఇంత‌కుముందు శాస‌న స‌భ‌లో బ్లూఫిలిం సీడీలు చూపించి పీత‌ల సుజాత ఎలా మాట్లాడారో చూశారు క‌దా! స్పీక‌ర్ ముందే ఈ అరాచ‌కం జ‌రిగినా వాళ్లు ఏం చేశారో తెలుసు క‌దా! మా ఎఫ్‌బీల్లో వల్గ‌ర్ కామెంట్లు పెట్ట‌డం స్పీక‌ర్‌కి, సీఎంకి, లోకేష్‌కి తెలియ‌వా? ఏదైనా పొలిటిక‌ల్‌గా ఫైట్ చేయండి.. నా మాట‌ల్లో త‌ప్పు ఉంటే లీగ‌ల్‌గా పోరాడండి.. పారిపోయేలా చేయాల‌నుకుంటే.. పారిపోయేవాళ్లు ఎవ‌రూ లేరు… అంటూ రోజా తీవ్ర ప‌ద‌జాలంతో మాట్లాడారు. ప్ర‌స్తుతం ఈ వీడియో ఇంట‌ర్వ్యూ ఆన్‌లైన్‌లో వైర‌ల్ అవుతోంది.

  •  
  •  
  •  
  •  

Comments