వీడియో : రోజా ఉగ్ర రూపం.. వాడిని కనిపెట్టి చెప్పుతో కొడతా..!!

Sunday, October 15th, 2017, 03:50:14 AM IST

ఏపీ పాలిటిక్స్ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా రోజా పాపులారిటీ బాగా పెరిగింది. రోజాపై ప్రత్యర్థుల విమర్శలు, ప్రత్యర్థులపై రోజా విమర్శలు కొత్తకాదు. కేవలం విమర్శలతోనే అనేక సందర్భాల్లో రోజా వివాదాలని ఎదుర్కొన్నారు. నగరి ఎమ్మెల్యేగా రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. సాధారణ నేతలు విమర్శిస్తే పట్టించుకోని తెలుగు దేశం పార్టీ రోజా మాట్లాడిన ప్రతిసారి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి టిడిపి నేతలకు ఏర్పడింది. సోషల్ మీడియా వేదికగా అధికార విపక్షాల మధ్య వార్ జరుగుతూనే ఉంది. ఇందుకోసం ఇరు పార్టీలు సపరేటుగా సోషల్ మీడియా విభాగాలని ఏర్పరుచుకున్నాయి. ఆ మధ్యన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ల మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేశారు. అది పెద్ద రచ్చ గా కూడా మారింది.

కాగా తాజగా రోజాకు కూడా ఆ పరిస్థితి ఎదురైంది. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో రోజా తన మార్ఫింగ్ ఫోటోల గురించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ రకంగా ఆమె ఉగ్ర అవతారమే ఎత్తారు. నంద్యాల ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ – వైసిపి మధ్య సవాల్ – ప్రతి సవాల్ లు జరిగాయి. టిడిపి నేత బోండా ఉమా మాట్లాడుతూ.. వైసీపీ ఓడిపోతే ఆ పార్టీ నేతలు గుండు గీయించుకోవడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ సవాల్ రోజా వరకు కూడా వెళ్లింది. కానీ ఆమె దీనిపై మాట్లాడలేదు. కాగా ఉపఎన్నిక ఫలితం తరువాత కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రోజా గుండుతో ఉన్నట్లు మార్ఫింగ్ ఫోటో చిత్రీకరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

దీనిపై మనోవేదనకు గురైన రోజా ఉగ్ర రూపం దాల్చారు. ఆ ఫ్లెక్సీ లో నా ఫోటో వేసిన వాడిని కనిపెట్టి చెప్పుతో కొట్టాలనుకుంటున్నా. వీళ్లకు అసలు బుద్దుందా. మన తెలుగు సంప్రదాయాల్లో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే గుండి గీయించుకుంటారు. నంద్యాలలో నేనేమైనా పోటీ చేసి ఓడిపోయానా. నాతో పోటీ ఏంటి. నేను అన్నీ పక్కన పెట్టి 5 నిమిషాలు కేటాయిస్తే ఇలాంటి టిడిపి ముఖ్యనేతల ఫ్లెక్సీలు వేయించడం కష్టం కాదు. సోషల్ మీడియాలో అయితే రూపాయి కూడా ఖర్చు ఉండదు. ఇలాంటి విషయాలే కాదు అశ్లీల ఫోటోలు చాలా పెడుతున్నారు. అవన్నీ చూస్తే చాల భాదగా అనిపిస్తుంది. మెసేజ్ లు వల్గర్ గా పెడుతున్నారు. రాజకీయంగా పోరాడలేక చేతకాని దద్దమ్మలా ఇలాంటివి చేస్తున్నారని రోజా వాపోయారు.