జగన్ పాదయాత్ర..రోజా పూజలు ఫలిస్తాయా..!

Thursday, November 2nd, 2017, 02:58:16 PM IST

గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న వైసిపి ఎమ్మెల్యే రోజా మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. జగన్ పాదయాత్ర నేపథ్యంలో ఆమె అధికార పార్టీని టార్గెట్ చేసారు. నేరుగా చంద్రబాబు పైనే విమర్శలు చేస్తూ తనదైన శైలిలో ఫైర్ బ్రాండ్ దూకుడిని చూపిస్తున్నారు. నవంబర్ 6 నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. జగన్ పాదయాత్ర విజయవంతం కావాలని రోజా గుడిలో పూజలు నిర్వహించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక భారీగా ఆస్తులు పెంచుకున్నారని అన్నారు. భార్యకు ఇల్లు కట్టించిన బాబు, కొడుకుకి మంత్రి పదవి, కోడలికి ఆస్తులు కట్టబెట్టారని అన్నారు. జగన్ పాదయాత్ర ప్రారంభించడంతోనే చంద్రబాబుకు కౌంట్ డౌన్ ప్రారంభం కానుందని అన్నారు. గతంలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. కానీ 600 వాగ్దానాలు చేసి ఏ ఒక్కదానిని నెరవేర్చలేదని రోజా ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చే గుణం వైఎస్ కుటుంబానికి మాత్రమే ఉందని రోజా ప్రస్తావించారు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతిఒక్క హామీని నెరవేర్చినట్లు రోజా తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments