మరో సంచలన షో తో బుల్లితెర పైకి రోజా..!

Monday, February 11th, 2019, 06:21:14 PM IST

ప్రముఖ సినీ నటి మరియు ఎమ్మెల్యే రోజా వెండితెర ప్రేక్షకులతో పాటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా సుపరిచితమే..”జబర్దస్త్” మరియు “ఎక్స్ట్రా జబర్దస్త్” షోలలో మెగా బ్రదర్ నాగబాబుతో కో జడ్జిగా వ్యవహరించి ఇప్పటికీ కొనసాగుతున్న రోజా ఇతర షోలకు కూడా హోస్టింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు ఈమె ప్రస్తుతం మరో కొత్త షో కి హోస్టింగ్ ఇస్తున్నారు.నిజ జీవితానికి సంబంధించి యదార్ధ ఘటనల ద్వారా ఈ షో వస్తున్నట్టు తెలుస్తుంది.”ప్రతీ క్షణం వెంటాడే ప్రమాదాలతో పారా హుషార్” అనే ట్యాగ్ లైన్ తో ఈ షో కి గాను “తస్మాత్ జాగ్రత్త” అనే పేరు పెట్టారు.ఈ షో ఈ రోజు నుంచి ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు జెమినీ ఛానెల్లో ప్రసారమవుతుంది.