యూట్యూబ్ సెన్సేషన్: రౌడీ బేబీ విధ్వంసకర రికార్డ్…!

Saturday, February 9th, 2019, 03:57:19 PM IST

యూట్యూబ్ సాక్షిగా సాయిపల్లవి రౌడీ బేబీ విధ్వంసం ఇంకా కొనసాగుతుంది, మొన్నటికి మొన్న కొలవెరి రికార్డ్ బద్దలు కొట్టిన ఈ పాట, ఇప్పుడు మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. పాట విడుదలైన నెలరోజుల్లోనే 18కోట్లకు పైగా వ్యూస్ సాధించి అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఒక్క వీడియో సాంగ్‌కు నెల రోజుల్లో అంత మొత్తంలో వ్యూస్ రావడం అంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా ఈ పాటలో ధనుష్ సాయిపల్లవిల కెమిస్ట్రీకి, సాయిపల్లవి డ్యాన్స్ లో గ్రేస్ కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ వీడియో సాంగ్ అప్లోడ్ అయిన గంటకే కోటి వరకు వ్యూస్ సాధించింది, ఇది సౌత్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే చాలా అరుదు, ఇప్పుడు అదే ఊపు కొనసాగిస్తూ దేశంలోకెల్లా అత్యధిక వ్యూస్ సాధించింది.

ప్రస్తుతం ఈ పాట వ్యూస్ 18.42 కోట్లకు చేరుకున్నాయి. దక్షిణాదిన అత్యధిక వ్యూస్ తెచ్చుకున్న పాట ఇదే. ఇంతకుముందు రికార్డు సాయిపల్లవి పాటే అయిన “వచ్చిండే” పేరిట ఉంది. ఫిదా సినిమాలోని ఆ పాట కూడా అప్పట్లో యూట్యూబ్ ను ఒక ఊపు ఊపింది, ప్రస్తుతం ఆ పాటకు 18.26కోట్ల వ్యూస్ వున్నాయి. ఆ రికార్డ్ ను రౌడీ బేబీ దాటేసింది.