RRR కాస్తా RRRR అవ్వబోతుందా..?

Monday, November 19th, 2018, 08:13:54 PM IST


రాజమౌళి,రామారావు,రామ్ చరణ్ ఇప్పుడు టాలీవుడ్ లో ఈ ముగ్గురి కాంబినేషన్ మీదనే అందరి కళ్ళు,బాహుబలి తర్వాత అంత ప్రతిష్టాత్మక చిత్రంగా ఇప్పుడు వీరి ముగ్గురి కాంబో లో వస్తున్న RRR చిత్రంను భావిస్తున్నారు.ఎందుకంటే ఈ ముగ్గురు టాలీవుడ్ లో ఒక సంచలనం.వీరు ముగ్గురు వారి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన వాళ్ళే..అయితే ఇప్పుడు వీరు తీస్తున్నటువంటి ఈ సినిమా యొక్క షూటింగ్ ఈ రోజే అట్టహాసంగా మొదలయ్యింది.అయితే టాలీవుడ్ లో ఈ చిత్రం యొక్క పేరు కూడా హాట్ టాపిక్ గా నిలిచింది.

టైటిల్ లో మూడు RRR లు పెట్టారు,ముందు ఈ ముగ్గురి పేర్లు R అనే అక్షరంతోనే మొదలవుతాయి కాబట్టి అలా పెట్టారు అని అనుకోవచ్చు కానీ రాజమౌళి దర్శకత్వం వరకే పరిమితం అని అందరికీ తెలుసు అందువల్ల రాజమౌళి ఎంత దర్శకుడు అయినా మాత్రం సినిమా టైటిల్ లోనే ఆయన పేరు వెయ్యించుకుంటారు అని కూడా భావించలేం.అలాగే రాజమౌళి ట్విస్టులు ఇవ్వడంలో కూడా మహా దిట్ట అందులో ప్లాన్ గానే ఆ ఇంకో R కి సంబంధించి ఎదో ట్విస్ట్ ని దాచే ఉంచుతాడు అని సినీ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.

అయితే మరి మూడో R కి సంబంచి కూడా ఎవరో వేరే నటుడు ఉండి ఉంటాడని కూడా అనుకుంటున్నారు.అది సాధ్యమైనంత వరకు రానా అని వార్తలొస్తున్నాయి.ఎందుకంటే ఇప్పుడు షూటింగ్ లో కనబడకపోయినా ముహూర్తం రోజున రానా రావడంతో ఈ కొత్త ప్రశ్న బయటకి వచ్చింది.మరి రాజమౌళి ఈ చిత్రం టైటిల్ లోనే ఇంత ట్విస్ట్ పెట్టాడు అంటే ఇక ముందు ఇంకెన్ని ట్విస్టులు ఇస్తాడో వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments