రాజమౌళి మల్టి స్టారర్ గురించి న్యూ అప్ డేట్ ?

Friday, October 5th, 2018, 09:15:13 PM IST


దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే క్రేజీ మల్టి స్టారర్ ట్రిపుల్ ఆర్ గురించి ఓ ఆసక్తికర న్యూస్ వచ్చేసింది. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కే ఈ సినిమా గురించి ఫాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఏకధాటిగా జరుగుతున్నాయని తెలిసింది. ఇప్పటికే అటు ఫిలిం సిటీ లోను, ఇటు అల్యూమినియం ఫ్యాక్టరీ లో భారీ సెట్టింగ్ కూడా నిర్మిస్తున్నారట. ఇక రెగ్యులర్ షూటింగ్ మాత్రం జనవరి నుండి మొదలు పెడతారట. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత షూటింగ్ పూర్తయింది. ఇక రామ్ చరణ్ – బోయపాటి శీను సినిమా నవంబర్ తో పూర్తీ కానుంది. ఈ లోగా సినిమాకు సంబందించిన అన్ని పనులు ఫినిష్ చేసి .. జనవారినుండి ఏకధాటిగా షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసాడు జక్కన్న. ఇప్పటికే హీరోయిన్స్ అన్వేషణ సాగుతుంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 1945 నేపథ్యంలో ఉంటుందని, చరణ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో గ్రాండ్ గా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నారు. ఇక కథ గురించి అయితే .. ఇంతవరకు ఎవరు టచ్ చేయని పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.