ట్రెండింగ్ – ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన దానయ్య…

Thursday, March 14th, 2019, 01:00:36 PM IST

బాహుబలి సిరీస్ తరువాత దర్శకదీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్… ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిపి అతిపెద్ద మల్టీస్టారర్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేశారు నిర్మాత దానయ్య… మీడియా సమావేశంలో మాట్లాడిన దానయ్య… భారతదేశం గర్వించే దర్శకుడు రాజమౌళితో సినిమాను తెరకెక్కించడం నా అదృష్టం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. అహ్మదాబాద్‌, పుణెలో మరో షెడ్యూల్‌ ఉంది. భారీ బడ్జెట్‌తో తీస్తున్నాం. ఎక్కడా రాజీపడటంలేదు. సినిమాను 2020 జులై 30 తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నాం. అన్నీ భాషల్లో దానికి తగ్గట్టు టైటిల్ పెడతారని సమాచారం…