జన్ ధన్ ఖాతాలు పొంగిపోతున్నాయ్..21 వేల కోట్లు ఎలా వచ్చాయ్..?

Wednesday, November 23rd, 2016, 07:52:18 PM IST

money
దేశం లో ఇప్పుడు ఎక్కడ చూసినా డబ్బు మాటే. మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో ఈ డబ్బు మాట దేశ వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది.సామాన్యులకు మోడీ ప్రవేశపెట్టిన జన్ ధన్ ఖాతాలు డబ్బుతో నిండి పొంగి పొర్లుతున్నాయి.పెద్ద నోట్ల రద్దు తో దేశ వ్యాప్తంగా ఉన్న జన్ ధన్ ఖాతాల్లోకి రూ 21000 కోట్లు వచ్చి పడ్డాయి. పట్టుమని రూ 200 కూడా ఉందని అకౌంట్లు లలోకి ఇంత భారీ మొత్తం లో నగదు డిపాజిట్ కావడంతో అధికారుల కళ్లు బయ్యర్లు కమ్ముతున్నాయి.

ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో జన్ ధన్ ఖాతాల్లోకి భారీగా నగదు జమ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జన్ ధన్ ఖాతాల్లో రూ 50 వేలకు మించి డిపాజిట్ చేస్తే ఆయా ఖాతాల పై నిఘా ఉంటుందని హెచ్చరించింది. అయినా డిపాజిట్లు ఆగడం లేదు.అవినీతి పరుల అతితెలివి తేటల్లో ఇది ఒకటని ఆర్థిక నిపుణులు అంటున్నారు. వారి నల్ల ధనాన్ని గ్రామాల్లో ఉన్న రైతులకు, ప్రజలకు పంచి వారి వ్య్తకి గత అకౌంట్లు, జన్ ధన్ ఖాతాల్లో జమ అయ్యోట్లు చేస్తున్నారు. కొద్దిరోజుల తరువాత తమ నల్ల ధనాన్ని ఖాతాల్లో జమచేసుకున్నవారికి కొంత కమిషన్ల రూపం లో ఇచ్చి మిగిలిన నల్ల ధనాన్ని పదిల పరుచుకుంటుంన్నారు.మోడీ పెద్ద నోట్లని రద్దు చేస్తున్నట్లు నవంబర్ 8 న ప్రకటించినప్పటి ఉంచి ఇప్పటివరకు రూ 21000 కోట్లు జన్ ధన్ ఖాతాల్లో జమ కావడం జరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.