జేబీఎస్ లో అదుపు తప్పిన బస్సు మనుషుల మీదకి దూసుకెళ్లింది

Wednesday, May 16th, 2018, 11:00:21 AM IST

ఓ వైపు ప్రభుత్వం కేటాయించిన వాహనాల్లోనే ప్రయాణం చేయాలని శుభాశితాలు పలుకుతూ మరో వైపు భద్రతా నియమాలు పాటించకుండా ప్రజలకు ప్రమాదాలు జరిగినా పట్టించుకోకుంది ప్రస్తుత ప్రభుత్వం. తాజాగా మంగళవారం రాత్రి సికిందరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ కు వచ్చిన వచ్చిన బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న హోటల్ మీదకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళితే పికెట్ డిపోకు చేస్డిన బస్సు నల్గొండ నుండి జూబ్లీ బస్ స్టేషన్ కు చేరింది. అక్కడనుండి బస్సును బస్ స్టాపులో నిలిపేందుకు డ్రైవర్ ప్రయత్నించగా ఆ బస్సు డ్రైవర్ కు కంట్రోల్ కాక అదుపు తప్పి పక్కనే ఉన్న గణేష్ టిఫిన్ సెంటర్ లోకి దూసుకెళ్లింది.

ఈ ప్రమాదంలో హోటల్ లో ఉన్న వంటల మాస్టర్ రాజన్ తో పాటు అక్కడే కూర్చోని భోజనం చేస్తున్న నిజామాబాద్ కు చెందిన ప్రయాణికుడు కన్నయ్యపైకి బస్సు దూసుకుపోయింది. ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఇద్దరికీ తీవ్ర గాయాలు తగలడం వలన అక్కడే ఉన్న పోలీసులు స్థానికులు 108 అంబులెన్స్ లో దగ్గరలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న జేబీఎస్ ఆవేఅనలోని మారేడు పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆ బస్సును బస్సు డ్రైవరు కాకుండా క్లీనర్ నడిపినట్టు సమాచారం అందింది. అంటే కాకుండా ప్రమాదం జరిగిన వెంటనే క్లీనర్ పరారీ కాగా స్థానికులు అతన్ని పట్టుకొని, క్లీనర్ ను బస్సు డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసారు. ప్రమాదం జరిగిన వ్యక్తులకి తగిన న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు వెల్లడించారు. ప్రత్యేక శిక్షణ లేకుండా, అవగాహనా, అనుభవం లేకుండా ఉద్యోగాలు కల్పిస్తే ఇలాగే ఉంటుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.