సీమలో ఆర్టీసీ మెరుపు సమ్మె

Saturday, September 27th, 2014, 10:44:12 AM IST


రాయలసీమలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. తమను మానసికంగా వేధిస్తున్న రాయలసీమ రీజియన్ ఆర్టిసీ ఈడి కోటేశ్వర రావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మెను ప్రారంభించారు. ఈ నేపధ్యంగా రాయలసీమలోని కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాలలోని డిపోల ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. అలాగే ఈడీపై చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. ఇక కార్మికుల మెరుపు సమ్మెతో రాయలసీమ జిల్లాలలోని డిపోలలో దాదాపు 1500లకు పైగా బస్సులు నిలిచిపోయాయి. కాగా దసరా పండుగ సందర్భంగా స్వస్థలాలకు ప్రయాణమైన ప్రయాణికులు ఈ సమ్మె కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదురుకుంటున్నారు.