త్రివిక్రమ్ – బన్నీ సినిమా టైటిల్ పై అప్పుడే రూమర్స్…!

Wednesday, March 13th, 2019, 08:36:34 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్న సంగతి తెలిసిందే, ఈ సినిమా ఇంకా ప్రీ – ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి కాలేదు ఇంతలోనే ఈ సినిమా టైటిల్ పై రూమర్లు మొదలయ్యాయి. సినిమా కథ ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా ఉండనుందని, సన్నాఫ్ సత్యమూర్తి తరహాలోనే ఈ కథ ఉండనుండదని వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే, కేథరిన్ తెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు “నాన్న నేను” అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

త్రివిక్రమ్ బన్నీల కాంబోలో వచ్చిన గత చిత్రం సన్నాఫ్ సత్యమూర్తిని ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యింది, ఆ నమ్మకంతోనే ఇప్పుడు చేయబోయే సినిమా కోసం కూడా ఫాదర్ సెంటిమెంట్ తో నిండిన కథనే త్రివిక్రమ్ రెడీ చేస్తున్నారని టాక్. మరి, ఈ వార్తల్లో నిజమెంతో తేలాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.