కోహ్లీ – రోహిత్ మధ్య విభేదాలు నిజమేనా?

Thursday, September 6th, 2018, 11:57:13 AM IST

టీమిండియా జట్టులో ఆటగాళ్ల మధ్య వివాదాలు మనస్పర్థలు రావడం ఎంతవరకు నిజమో తెలియదు గాని ఆటగాళ్ల ప్రవర్తన చుస్తే అప్పుడపుడు అది నిజమే అనిపిస్తుంది. గతంలో సీనియర్ ఆటగాళ్ల మధ్య కూడా విబేధాలు వచ్చినట్లు అనేక వార్తలు వచ్చేవి కానీ బిసిసిఐ వాటిని బయటికిరానివ్వకుండా పరిష్కరించేదని ఒక రూమర్ ఉంది. ఇకపోతే చాలా రోజుల తరువాత టీమిండియా ప్లేయర్ల మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది.

భారత సారధి విరాట్ కోహ్లీ ఓపెనర్ రోహిత్ శర్మ మధ్య మాటలు లేవని జాతీయ మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. అందుకు కారణం రోహిత్ శర్మకు టెస్టుల్లో స్థానం దక్కకపోవడమే కారణమని తెలుస్తోంది. జట్టు సెల్సక్షన్ కమిటీలో కెప్టెన్ పాత్ర ఉంటుందని అందరికి తెలిసిందే. అందులో భాగంగానే విరాట్ రోహిత్ ను టెస్ట్ ఫార్మాట్ కి దూరం చేశాడని రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడట. ఇకపోతే పరిస్థితులు కూడా కొత్త తరహా అనుమానాలకు దారి తీస్తోంది. రోహిత్ శర్మ సోషల్ మీడియాలో కోహ్లీని సడన్ గా అన్ ఫాలో చేయడంతో అసలు ఏం జరిగిందనే విషయాన్నీ చెప్పాలని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments