కోచ్ రావిశాస్త్రితో బాలీవుడ్ బ్యూటీ ప్రేమాయణం?

Monday, September 3rd, 2018, 04:55:03 PM IST

క్రికెట్ కు బాలీవుడ్ కి ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో ఎలాంటి వేడుకలు జరిగినా అందులో స్టార్స్ తో పాటు స్టార్ క్రికెటర్స్ కూడా దర్శనమిస్తుంటారు. ఇక ఆటగాళ్లకు హీరోయిన్స్ కి మధ్య ఉండే స్నేహాల గురించి అందరికి తెలిసిందే. గత కొంత కాలంగా ప్రేమల నుంచి పెళ్లిళ్ల వరకు కూడా ఈ సెలబ్రెటీలు వస్తున్నారు. అయితే ఈ సారి టీమిండియా కోచ్ అయినా రవిశాస్త్రి బాలీవుడ్ భామతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సీనియర్ క్రికెటర్ గా కామెంటేటర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రవిశాస్త్రి ప్రస్తుతం భారత టీమ్ కోచ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే బాలీవుడ్ హాట్ బ్యూటీ నిమ్రత్‌ రవిశాస్త్రి గత రెండేళ్లుగా లవ్ లో ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. 2015 జర్మనీకి చెందిన ఒక లగ్జరీ కార్ల కంపెనీ నిమ్రత్‌, రవిశాస్త్రిలను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. దీంతో అప్పటి నుంచి వారి మధ్య స్నేహం ప్రేమ వరకు వెళ్లినట్లు టాక్. ఇంకా ఈ సెలబ్రెటీలు రూమర్స్ పై ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో మీడియాల్లో హాట్ టాపిక్ గా మారింది. రవిశాస్త్రికి 1990లో రీతూ సింగ్‌తో వివాహమైంది. వీరికి అలేఖా అనే కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు కలిసే ఉంటున్నారు. కానీ ఇప్పుడు రవిశాస్త్రి లవ్ లో ఉన్నారని వార్తలు వెలువడటం గమనార్హం. మరి ఈ విషయంపై రవిశాస్త్రి నిమ్రత్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments