మరో సెంచరీని ఖాతాలో వేసుకున్న “రన్ మెషిన్”..!

Tuesday, March 5th, 2019, 04:56:48 PM IST

ప్రస్తుతం భారత్ మరియు ఆసీస్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసినదే..ఈ రోజు ఈ ఇరు జట్ల మధ్య నాగ్ పూర్ వేదికగా రెండో మ్యాచ్ మొదలయ్యింది.ఈ మ్యాచులో జట్టు సారధి మరోసారి వన్ మ్యాన్ షో చూపించారు.మిడిలార్డర్ సహా ఓపెనర్ బాట్స్మెన్ లు అంతా చేతులెత్తేయ్యగా రన్ మెషిన్ కోహ్లీ తనదైన శైలిలో జట్టుని నడిపించారు.

మధ్యలో విజయ్ శంకర్ 41 బంతుల్లో 46 పరుగులు చేసి కాస్త సపోర్ట్ గా నిలిచాడు.ఇక ఇతను కోహ్లీ తప్ప మరెవరు ఆకట్టుకునే స్థాయిలో ఆడలేదు.ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ తన కెరీర్ లో మరో శతకాన్ని నమోదు చేసుకున్నారు.మొదటి నుంచి చాలా జాగ్రత్తగా ఆడుతూ వచ్చిన కోహ్లీ ఇతర ఆటగాళ్లు పేలవమైన ప్రదర్శనను కనబర్చినా కోహ్లీ మాత్రం తనదైన శైలిలో ఆకట్టుకొని 107 బంతుల్లో 103 పరుగులు చేసి శతకాన్ని పూర్తి చేసి 116 పరుగులు వద్ద పెవిలియన్ కు చేరారు..దీనితో కోహ్లీ ఖాతాలో 40 సెంచరీలు నమోదయ్యాయి.