తీవ్రమవుతున్న రూ.100 నోట్ల కొరత

Monday, May 7th, 2018, 02:09:32 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో చిల్ల కొరత తీవ్రమైన విషయంతెలిసిందే. అయితే ఆ సమయంలోనే ప్రభుత్వం కొత్త రూ.2000 మరియు కొత్త రూ.500 అలానే రూ.200 నోట్లు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. కాగా అప్పటిలో కొన్నాళ్ళు చిల్లకొరతను ఎలాగో సరిచేసి ప్రభుత్వం, మళ్ళి ప్రస్తుతం ఆ సమస్య తీవ్ర తరం కావడంతో తల పట్టుకుంటోంది. విషయంలోకి వెళితే, ప్రస్తుతం ప్రజలు తమ నగదును ఏటీఎం లో డ్రా చేస్తుంటే ఎక్కువగా పెద్ద నోట్లయిన రూ. 2000 మరియు రూ. 500 ఎక్కువగా వస్తున్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. అంతే కాదు తాము ఏదైనా ఏటీఎం కి వెళ్లి డినామినేషన్ రూ.900, రూ. 1600 ఇలా టైపు చేస్తుంటే కేవలం రూ.1000 లేదా రూ.1500 మరియు రూ.2000 మాత్రమేవస్తాయని ఏటీఎంలు చూపెడుతున్నట్లు చెపుతున్నారు.

దాదాపుగా అన్ని ఏటీఎం లలోను ఇటువంటి పరిస్థితే ఉంటోందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ విషయమై బ్యాంకు అధికారులను నిలదీస్తే తమ దగ్గర రూ.100 నోట్లు వున్నాయి, కాకపోతే అవి 2005 కు చెందినవని, అంతేకాక అవి బాగా నలిగిపోవడంవల్ల ఏటీఎం లలో పెట్టడం కుదరదని, అందుకే వున్న కాస్త కొత్త రూ.100 నోట్లను అందులో ఉంచుతున్నట్లు చెపుతున్నారు. కాగా ప్రభుత్వమే సత్వర చెర్యలు తీసుకుని ఈ రూ.100 నోట్ల సమస్యకు ఒక పరిష్కారం చూపాలని అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం, ఇదే విషయమై కేంద్ర మంత్రి ఒకరు మాట్లాడుతూ, త్వరలో నూతన రూ.100 నోట్ల ముద్రణ రిజర్వు బ్యాంకు మొదలెట్టనున్నట్లు చెప్పారట. ఒకవేళ అదే నిజం అయితే చిల్లర సమస్య చాలా వరకు తీరినట్లే మరి…..