రష్యాలో నర మాంసాన్ని వీధుల్లో అమ్మారు

Saturday, December 31st, 2016, 12:00:05 PM IST

mad
రష్యా… ఈ దేశం పేరు చెప్తే అందరికీ అది ఒక అభివృద్ధి చెందిన దేశంగానే తెలుసు. కానీ ఒకప్పుడు ఆ దేశంలో తినడానికి తిండి లేక కొన్ని కోట్లమంది మరణించారనే సంగతి చాలామందికి తెలీదు. 19వ దశకంలో రష్యా కనీవినీ ఎరుగని కరువుతో కొట్టుమిట్టాడింది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత రష్యాలో ప్రజా తిరుగుబాటు, కరువు, ప్రభుత్వ అసమర్ధతల వాళ్ళ దేశంలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో దాదాపు ఆ దేశంలో 2.5 కోట్ల మంది రష్యన్లు మృతి చెందినట్టు ఒక అంచనా.

ఆ రోజుల్లో అక్కడి ప్రజలు ఆకలి తీర్చుకోవడానికి చేసిన పనులు తెలిస్తే కన్నీళ్లు ఆగవు. గడ్డి, కుక్కలు, పిల్లులు, పశువులు, మానవుల మలాలను కూడా భుజించారు. కొంతమంది తమ ఆకలి తీర్చుకోవడానికి కన్న బిడ్డలను కూడా చంపి అక్కలి తీర్చుకున్నారు. 1921 నుండి 1922 మధ్య కాలంలో ఏర్పడిన ఈ కరువు పరిస్థితులను తట్టుకోలేక నర మాంసానికి కూడా అలవాటు పడ్డారు రష్యన్లు. రష్యన్ వీధుల్లో నర మాంసాన్ని అమ్మే దుకాణాలు కూడా వెలిసాయి. అక్కడ కొంతమంది మనుషులను చంపి కిలోల లెక్కన అమ్ముతున్నా అక్కడి ప్రభుత్వం ప్రజలు పట్టించుకోలేదు. అస్థిపంజరాలు లా బ్రతుకుతున్న పిల్లలు, మహిళలు, వృద్ధులను కొంతమంది ఫోటోలను తీసి పేపర్లలో వేశారు. ఆ ఫోటోలను చుసిన అమెరికా, యూరప్ దేశాలు వారికీ ఆహరం అందించడంతో చాలామంది ప్రాణాలు నిలుపుకున్నారు. అలాంటి సంఘటనలను తట్టుకుని కూడా రష్యా కొద్దికాలంలోనే అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు తెచ్చుకోవడం నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే..!

  •  
  •  
  •  
  •  

Comments