చేవెళ్ల స‌భ సాక్షిగా కారెక్కుతున్నారు!

Thursday, March 14th, 2019, 10:13:42 AM IST

గులాబీ ద‌ళ‌ప‌తి తెలంగాణ‌లో చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్ కాంగ్రెస్‌ను క‌ల్లోలం చేస్తోంది. తెరాస ధాటికి కాంగ్రెస్ నాయ‌కులు కారెక్క‌డానికి సిద్ధ‌మ‌వుతుంటే సీనియ‌ర్ ల‌కు మాత్రం ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ట‌. ఇప్ప‌టికే ఈ పార్టీ నుంచి తెరాస‌కు భారీగా వ‌ల‌స‌లు మొదల‌య్యాయి. ఈ వేడి త‌గ్గ‌డంలేదంటే చేవెళ్ల ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి త‌న త‌న‌యుడు కార్తీక్‌రెడ్డితో క‌లిసి కారెక్క‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే కేటీఆర్‌తో అస‌దుద్దీన్ ఓవైసీ ఇంట ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌లు జ‌రిపిన స‌భిత బుధ‌వారం మ‌రో ద‌ఫా సీఎం కేసీఆర్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం కావ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

అయితే తెరాస‌లో చేర‌డానికి స‌బితా ఇంద్రారెడ్డి రెండు డిమాండ్‌ల‌ని తెర‌పైకి తీసుకొచ్చార‌ట‌. ఒక‌టి త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంతో పాటు త‌న త‌న‌యుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్. అయితే ఈ రెండు డిమాండ్‌ల‌లో కేసీఆర్ ఒక డిమాండ్‌కే త‌లొగ్గిన‌ట్లు తెలుస్తోంది. స‌బిత‌కు మంత్రి ప‌ద‌వి కోర‌గా స‌మాధానం దాటవేసిన కేసీఆర్ యువ నేత కార్తీక్‌రెడ్డికి మాత్రం చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఇవ్వ‌డానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. దీంతో త్వ‌ర‌లో చేవెళ్ల‌లో జ‌ర‌గ‌బోయే భారీ బ‌హిరంగ సాక్షిగా త‌ల్లీ కొడుకులు కారెక్క‌డానికి సిద్ధంగా వున్నామ‌ని కేసీఆర్‌కు తెలిపిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. మేము అడ‌గాల్సిన‌వి అడిగాం. ముఖ్‌య‌మంత్రి చెప్పాల్సిన‌వి చెప్పారు. త్వ‌ర‌లో చేవెళ్ల‌లో జ‌ర‌గ‌బోయే భారీ బ‌హిరంగ స‌భ‌లో తెరాస తీర్థం పుచ్చుకోబోతున్నామ‌ని మీడియాతో కార్తీక్‌రెడ్డి చెప్ప‌డం గ‌మ‌నార్హం.