ఇక వారిని వదిలేయండి.. స్మిత్, వార్నర్ పై సచిన్ కామెంట్స్!

Friday, March 30th, 2018, 09:58:27 AM IST

రీసెంట్ గా దక్షిణాఫ్రికాతో జరిగిన కేప్‌టౌన్‌ టెస్ట్ లో ఆస్ట్రేలియా టీమ్ సభ్యులు బాల్ టాంపరింగ్ కు పాల్పడిన సంగతి తెలిసిందే. స్మిత్, వార్నర్ పై ఏడాది పాటు నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ పై 9 నెలల పాటు నిషేధం విధించడంతో ప్రపంచం క్రికెట్ అభిమానులని ఈ ఘటన షాక్ కి గురి చేసింది. అదే విధంగా చేసిన తప్పును ఒప్పుకున్న స్మిత్ వార్నర్ కూడా ఎంతో ఆవేదనకు లోనవుతున్నారు. స్మిత్ సిడ్నీలో అడుగుపెట్టగానే మీడియా సమావేశంలో కంటతడి పెట్టి అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.

అయితే వీరిపై సీనియర్ క్రికెటర్లతో పాటు యువ క్రికెటర్లు కూడా సానుభూతి తెలుపుతున్నారు.
మీడియా ఇంతటితో ఈ విషయాన్నీ వదిలేయాలని గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, కెవిన్ పీటర్సన్‌లు తెలియజేశారు. ఇక సచిన్ టెండూల్కర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ఇప్పటికే వారు ఎంతగానో బాధపడుతున్నారు. వారిని మరింత బాధపెట్టవద్దు వారిని ఒంటరిగా వదిలియడం బెటర్ అని మీడియాకు తెలిపారు. అంత కాకుండా ఫ్యామిలీతో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో తమ తప్పును గుర్తు చేసుకుంటూ ఉంటారు కావున వారిని ఇకనైనా ప్రశాంతంగా వదిలేసి కొంత మానసిక ప్రశాంతత కల్పించాలని సచిన్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు.