ఆఫ్రిదికి సచిన్ ఝలక్!

Thursday, April 5th, 2018, 04:02:59 PM IST


మన దాయాధి దేశం పాకిస్థాన్ క్రికెటర్ లు పలుమార్లు ఇండియా పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన ఘటనలు అక్కడక్కడ చూసాము. అయితే ప్రస్తుతం రెండురోజుల క్రితం పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది కాశ్మీర్ విషయమై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. అయితే అతనికి మన క్రికెటర్లు పలువురు ఘాటుగా రిప్లై కూడా ఇచ్చారనుకోండి. అయితే ఈ విషయమై ప్రస్తుతం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్పందించారు. ఇటీవ‌ల క‌శ్మీర్‌లో 12 మంది ఉగ్ర‌వాదుల‌ను భారత సైన్యం మ‌ట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ట‌నపై క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌పై అణిచివేత తీవ్రంగా కొన‌సాగుతోంద‌ని, అక్క‌డి ప్ర‌జ‌ల ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, ఐక్య‌రాజ్య‌స‌మితి వంటి సంస్థ‌లు ఏమి చేస్తున్నాయ‌అనేది ఆఫ్రిది ట్వీట్ సారాంశం.

అఫ్రీది చేసిన ఈ ట్వీట్ల‌కు భార‌త్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, గౌతం గంభీర్, క‌పిల్‌దేవ్ ఘాటుగా స‌మాధానాలిచారు కూడా. తాజాగా స‌చిన్ కూడా అఫ్రీది ట్వీట్ల‌పై స్పందించారు. తాము ఏమి చేయాలో బ‌య‌టి వ్య‌క్తులు చెప్పాల్సిన ప‌నిలేద‌న్నారు. దేశాన్ని న‌డిపించే స‌మర్థ‌మైన నేత‌లు మ‌నకున్నారు. మ‌నం ఏమి చేయాలో బ‌య‌టి వ్య‌క్తులు చెప్పాల్సిన ప‌ని లేదని స‌చిన్ సచిన్ ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్గా మారింది….

  •  
  •  
  •  
  •  

Comments