వీడియో : రోడ్డు మీద గల్లి క్రికెట్ ఆడిన సచిన్..

Tuesday, April 17th, 2018, 09:00:15 AM IST


క్రికెట్ అంటే మనకు మొదటగా గుర్తొచ్చే పేరు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. అంతర్జాతీయ క్రికెట్‌లో సుధీర్ఘకాలం కొనసాగి క్రికెట్‌కు ఎంతో సేవ చేశారు. అందుకే అతన్ని అభిమానులు క్రికెట్ దేవుడిగా పిలుచుకుంటున్నారు. రిటైర్మెంట్ ప్రకటించినా కూడా ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ ఫ్రాంఛైజీకి మార్గనిర్దేశనం చేస్తూ ఇంకా క్రికెట్ ఆటతోనే అనుబంధం కొనసాగిస్తున్నాడు.

తాజాగా సచిన్ ముంబయి గల్లీలో కొంతమంది యువకులతో కలిసి క్రికెట్ ఆడాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏదో రహదారిపై రాత్రివేళ పక్క నుంచి వాహనాలు వెళ్తున్నా కూడా ప్లాస్టిక్ డివైడర్‌ను స్టంప్‌లుగా చేసుకొని సచిన్ బ్యాటింగ్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2013లో రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 78 మ్యాచ్‌ల్లో 2,334 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీతో పాటు 13 అర్ధశతకాలున్నాయి.