మోడీ మాట సచిన్ కు తెగ నచ్చేసింది..!

Sunday, January 29th, 2017, 06:15:09 PM IST

sachin-modi
ఆదివారం జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు.ప్రతి విద్యార్థి తనతో తానే పోటీపడాలని అప్పుడే వ్యక్తిత్వం సహా విజయాలు కూడా సాధ్యమవుతాయని మోడీ అన్నారు. కొందరు విద్యార్థులు పరీక్షల్లో మరచిపోతుంటారని బయటకు వచ్చిన తరువాత సమాధానాలు గుర్తుకు వస్తాయని ఇది కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే అలా జరుగుతుందని మోడీ అన్నారు.

జీవితాన్ని ముందుకు నడిపించడానికి నీతో నువ్వే పోటీ పడాలని మోడీ విద్యార్థులకు సూచించారు.ఈ విషయంలో మోడీ సచిన్ ని విద్యార్థులకు ఉదాహరణగా చెప్పాడు. సచిన్ క్రికెట్ లో సుదీర్ఘ కాలం కొనసాగాడని, దాదాపు 20 ఏళ్ల పాటు తన రికార్డులను తానే అధికమించాడని మోడీ విద్యార్థులకు తెలిపాడు.సచిన్ జీవన యాత్ర ఒక అద్భుతమని మోడీ అన్నారు. ఈ సందర్భగా సచిన్ సోషల్ మీడియా ద్వారా మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పినందుకు, తనని ఆ విషయం లో ఉదహరించినందుకు సచిన్ మోడీ కి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థికైనా క్రీడా కారుడికైనా సాధన ముఖ్యమని సచిన్ ట్వీట్ చేసాడు.