వైరల్ ట్వీట్ : సెహ్వాగ్ పై రివేంజ్ తీర్చుకున్న సచిన్.. ట్వీట్ చదివినోళ్లు గ్రేట్..!

Friday, October 20th, 2017, 06:06:19 PM IST

భారత అత్యుత్తమ ఓపెనింగ్ జోడిలలో సచిన్ – సెహ్వాగ్ జోడి కూడా ఒకటి. వీరిద్దరూ భారత జట్టుకు అనేక చిరస్మరణీయ విజయాల్ని అందించారు. కాగా నేడు వీరేంద్ర సెహ్వాగ్ పుట్టిన రోజు. సెహ్వాగ్ ట్విట్టర్ లోకి దిగాడంటే జోకులు పటాకుల్లా పేలాల్సిందే. సెహ్వాగ్ ట్వీట్ లు అంతలా అలరించేవిగా ఉంటాయి. కాగా సెహ్వాగ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో సచిన్ వెరైటీ గా ఆలోచించాడు. అక్షరాలని తల్లక్రిందులు చేసి పెట్టిన ట్వీట్ వైరల్ గా మారింది. ఓ రకంగా ఇది వీరు పై సచిన్ తీర్చుకున్న రివెంజ్.

మైదానంలో ఆడే సమయంలో నేను ఏం చెప్పినా ఉల్టాగా చేసే వాడివి. అందుకోసం నీకు ఈ ఉల్టా ట్వీట్ అంటూ సచిన్ పోస్ట్ పెట్టాడు. సెహ్వాగ్ కూడా అంతే చమత్కారంగా స్పందించాడు. ‘ దేవుడా(సచిన్) ధన్యవాదాలు. మనం చేసే పనులు పైన ఉన్న దేవుడు గమనిస్తూనే ఉంటాడని విన్నాం. కానీ ఇప్పుడు అర్థమైంది. నువ్వు అప్పుడు ఏం చెప్పేవాడివో’ అని సెహ్వాగ్ బదులిచ్చాడు.

  •  
  •  
  •  
  •  

Comments