పుట్టంరాజు కండ్రిగలో సచిన్..!

Wednesday, November 16th, 2016, 01:39:47 PM IST

sachin
క్రికెట్ లెజెండ్, రాజ్యసభ సభ్యడు సచిన్ టెండూల్కర్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో పుట్టం రాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఏడాది క్రితం సచిన్ ఆ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి తొలిసారి వచ్చాడు. కాగా బుధవారం పుట్టంరాజు కండ్రిగలో సచిన్ మరోమారు పర్యటించారు. ఆ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి సచిన్ అక్కడికి చేరుకున్నాడు. ఈ మేరకు ఆగ్రామ మహిళలు సచిన్ కు పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సచిన్ గ్రామంలోని సామాజిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అధికారులతో స్వచ్చభారత్ పై సమీక్ష నిర్వహించారు.గతేడాది ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న సచిన్ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేశారు.కేంద్ర మంత్రివర్గ నిబంధనల మేరకు మూడు ఆదర్శ గ్రామాల్లో పుట్టంరాజు కండ్రిగ మొదటి స్థానం లో నిలిచింది.