స్వామిపై డౌట్..పన్నీర్, స్టాలిన్ ఏం చేయబోతున్నారు..?

Saturday, February 18th, 2017, 09:55:11 AM IST


తమిళరాజకీయం అత్యంత ఆసక్తి కర క్రీడగా మారిపోయింది. తమిళ రాజకీయ సంక్షోభం నేటితో ముగియనుందా లేక కొనసాగనుందా ? అనే అంశం మరి కొన్ని గంటల్లో తేలనుంది.పళని స్వామి వైపు ఉన్న 124 మంది ఎమ్మెల్యేలలో మైలాపూర్ ఎమ్మెల్యే ఇప్పటికే పన్నీర్ వర్గంలో జారుకునట్లు తెలుస్తోంది. మ్యాజిక్ ఫిగర్ 117 కాగడంతో కేవలం 10 ఓట్లు అత్యంత కీలంగా మారినట్లు తెలుస్తోంది.

పళని వర్గంలో 20 మంది ఎమ్మెల్యేలు ఎదురుతిరిగారన్న వార్తల నేపథ్యంలో పన్నీర్ స్టాలిన్ లు ఏం చేయబోతున్నారు ? పళనిస్వామికి వ్యతిరేకంగా వీరిద్దరూ పని చేసి అతడికి ముఖ్యమంత్రి పదవి దూరం చేయనున్నారా ? అనే అంశాలు ఉత్కంఠ ని రేపుతున్నాయి. కాగా ప్రతిపక్ష నేత స్టాలిన్ తో పన్నీర్ చేతులు కలిపితే సంచలనం జరిగే అవకాశం లేకపోలేదు. పన్నీర్ వైపు ఉన్న 12 మంది ఎమ్మెల్యేలను కలుపుకుంటే స్టాలిన్ బలం 109 కి చేరుతుంది. అంతే స్టాలిన్ ముఖ్యమంత్రి కావడానికి కేవలం 8 ఓట్లు వస్తే సరిపోతుంది.పరిస్థితులు గమనిస్తుంటే ఏదైనా జరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.