సిఎం కేసీఆర్ ఇంట్లో విషాదం….!!!

Monday, August 6th, 2018, 05:57:26 PM IST

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు మరియు ప్రస్తుత తెలంగాణ సిఎం కేసీఆర్ ఇంట్లో నేడు ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. ఆయన సోదరి లీలమ్మ నేడు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లీలమ్మ కొన్నాళ్ళనుండి నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతునారు. కాగా ఆమె నేడు హఠాత్తుగా కన్నుమూశారు. ప్రస్తుతం ప్రధాని మోడీతో భేటీ కోసం ఢిల్లీ పర్యటనలో వున్న సీఎం కేసీఆర్, సోదరి మరణవార్త తెలియగానే అర్ధాంతరంగా తన పర్యటనను నిలిపివేసి,

హుటాహుటిన అక్కడినుండి తిరుగు పయనమయినట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం ఢిల్లీ నుండి బయలుదేరిన అయన, సాయంత్రానికి హైదరాబాద్ చేరుకోనున్నారట. ఇక హాస్పిటల్ లో మృతి చెందిన లీలమ్మను ఇప్పటికే కేసీఆర్ స్వగృహానికి తరలించారని, లీలమ్మ మరణ వార్తను తెలుసుకున్న అయన బంధువులు మరియు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు ఒక్కొరొక్కరుగా అయన నివాసానికి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నట్లు సమాచారం. కాగా లీలమ్మ మరణంతో కేసీఆర్ ఇంట విషాద ఛాయలు అలముకున్నాయి…..

  •  
  •  
  •  
  •  

Comments