వార్నర్ కుటుంబంలో విషాదం!

Thursday, May 24th, 2018, 11:08:56 AM IST

ఆస్ట్రేలియా బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్ ఇటీవల దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బాల్ టాంపరింగ్ కు పాల్పడి నిషేధానికి గురైన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత వార్నర్ గత సీజన్ ఐపీఎల్ లో ఆడే అర్హతను కూడా కోల్పోయాడు. ఆ తదనంతరం దక్షిణాఫ్రికా నుండి తిరిగివచ్చిన వార్నర్ కుటుంబంలో ప్రస్తుతం మరొక విషాదం చోటుచేసుకుంది. గర్భవతిగా వున్న వార్నర్ భార్య కాండీస్ కు గర్భస్రావమైందట. బాల్ టాంపరింగ్ కేసు సమయంలో భర్తపై నిషేధం విధించిన సమయంలో తాను ఎంతో మానసిక వేదనకు గురయ్యానని, అలానే దక్షిణాఫ్రికా టూర్ సమయంలో ఎక్కువగా సుదూర ప్రయాణాలు చేయడం వల్ల కడుపులోని బిడ్డపై అధిక వత్తిడి పడడంవల్ల కూడా తనకు గర్భ స్రావం కావడానికి గల కారణాలుగా చెపుతోంది కాండీస్.

ఇటీవల ఆస్ట్రేలియన్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాండీస్ తనకు అబార్షన్ అయిన విషయాన్ని మీడియాకి తెలిపింది. ఒకరోజు బాత్రూం లో ఉండగా హఠాత్తుగా తనకు రక్త స్రావం అవుతుండడం గమనించానని, వెంటనే వార్నర్ ను పిలిచి జరిగిన ఘటన గురించి చెప్పానని, ఆ వార్త విన్న వార్నర్ కన్నీటి పర్యంతమయినట్లు కాండీస్ చెప్పుకొచ్చింది. దీనితో వార్నర్ జీవితంలో గత దక్షిణాఫ్రికా పర్యటన అన్ని విధాలుగా తీవ్ర విషాదాన్ని నింపిందని తెలుస్తోంది…..

  •  
  •  
  •  
  •  

Comments