సాధినేని యామినికి ఇదేం పోయేకాలం..!

Monday, February 11th, 2019, 02:28:38 PM IST

ఈ రోజు ఢిల్లీలోని తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా తరలి వెళ్లి అక్కడ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల కేంద్రప్రభుత్వానికి మరియు ప్రధాని మోడీకి నిరసనగా మోడీ వ్యతిరేఖ శక్తులన్నిటిని కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్న సంగతి తెలిసిందే.అయితే అక్కడ నిరసనకు గాను తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మహిళా ప్రతినిధి సాధినేని యామిని కూడా హాజరయ్యారు,ఇంతకు మునుపు ఈవిడ ఇతర పార్టీల నేతలపై ఎలాంటి వ్యాఖ్యలై చేసారో అందరికీ తెలుసు.దానితో అప్పట్లోనే ఆ పార్టీల అభిమానులు అంతర్జాల మాధ్యమాలలో విపరీతమైన ట్రోల్ల్స్ పడ్డాయి.

ఇప్పుడు ఆవిడ ఎవరిని ఏమనకపోయిన తెలుగుప్రజలు ఈమెకి ఇప్పుడెందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అని తలలు పట్టుకుంటున్నారు.ఈమె ఇప్పుడు ఢిల్లీలో తెలుగుతల్లి అవతారం లో కనిపించి తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు.దీనితో ఈమెని ఈ గెటప్ లో చూసిన సామాన్య జనం అంతర్జాలంలో ఒక్క సారిగా ఖంగుతింటున్నారు.ఆ మధ్య ఈమె నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయో అందరికీ తెలుసు.ఇప్పుడు అలాంటి మనిషి తెలుగు తల్లి వేషధారణ కనిపించేసరికి రాష్ట్రంలోని సామాన్య ప్రజలు మరోసారి ఆమెపై వారి అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.