ఏంటి..ఎన్నికల్లో సాధినేని యామిని పోటీ..నియోజకవర్గం ఫిక్స్?

Thursday, March 14th, 2019, 06:16:10 PM IST

జనసేన పార్టీ అధినేత పవన్ పై చేసిన ఆరోపణల వలన సాధినేని యామిని అనే తెలుగుదేశం పార్టీ మహిళ వెలుగులోకి వచ్చింది.అప్పుడు పవన్ పై ఈమె చేసిన ఆరోపణలు సంచలానికి దారి తీయడంతో అప్పటి నుంచి ఈమె కూడా రాజకీయాల్లో ఉందని చాలా మందికి తెలిసింది.ఇక అప్పటి నుంచి ఈమె తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా భాద్యతలు చేపట్టి టీడీపీ ఫైర్ బ్రాండ్ గా మారిపోయారు.అయితే ఇప్పుడు ఈమె గురించి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది.

ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించిన ఈమె ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగనుందట.అందుకోసం ఒక నియోజకవర్గం కూడా ఇప్పటికే ఖరారు అయ్యిందని కూడా తెలుస్తుంది.సాధినేని యామిని గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.ఇప్పటి వరకు అధికారికంగా అయితే ఎలాంటి వార్తలు బయటకు రాలేదు,కానీ అంతర్గతంగా యామిని ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తుంది.దీనిపై టీడీపీ అధిష్టానం కూడా సానుకూల స్పందననే కనబర్చారని ఇక అన్ని సెట్ అయినట్లయితే యామినికి సీట్ ఖరారు అవుతుందని తెలుస్తుంది.