టాలీవుడ్ ట్రెండింగ్ : అదే జ‌రిగితే.. తేజూకి మ‌రో ప్లాప్ రెడీ అంట‌ ..?

Thursday, February 21st, 2019, 02:45:07 AM IST

మెగా కాంపౌండ్ నుండి అప్‌లోడ్ అయిన మెగా మేన‌ళ్ళుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ ఈ మ‌ధ్య వ‌రుస ప్లాప్స్‌తో రేసులో వెనుక‌బ‌డిపోయాడు. ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి.

దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాల‌ని భావిస్తున్న తేజూ.. మినిమం గ్యారెంటీ డైరెక్ట‌ర్ నేనే శైల‌జ ఫేం కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో చిత్ర‌ల‌హ‌రి చిత్రంలో న‌టిస్తున్నాడు.

అయితే ఇప్పుడు తాజా మేట‌ర్ ఏంటంటే ఇటీవ‌ల విడుద‌ల అయిన బాలీవుడ్ మూవీ గ‌ల్లీ బాయ్ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు వ‌ర్షం కురిపిస్తుండ‌డ‌మే కాకుండా, విమ‌ర్శ‌కులు కూడా ప్ర‌శంస‌లు కూడా కురిపిస్తున్నారు.

దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌ల‌య్యాయి. ఈ సినిమా రీమేక్ హ‌క్కులు కోసం గీతా ఆర్ట్స్, దిల్ రాజులు పోటీ ప‌డుతున్నాట్టు స‌మాచారం.

అయితే గ‌ల్లీబాయ్ రీమేక్స్ రైట్స్ చివ‌రికి గీతా ఆర్ట్స్ వారికే సొంత కానున్నాయ‌ని.. ఆ సినిమాలో మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌నున్నార‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి.

దీంతో సాయి ధ‌రమ్ తేజ్‌కు మ‌రో ప్లాప్ సిద్ధం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాకి మెయిన్ ప్ల‌స్ ర‌ణ్‌వీర్ సింగ్ న‌ట‌న‌. ఒక గ‌ల్లీ కుర్రాడి పాత్ర‌లో పూర్తిగా ఒదిగిపోయాడు ర‌ణ్‌వీర్.

ఇక ఆ సినిమాలో భాగోద్వేగాలు చ‌క్క‌గా హ్యాండిల్ చేసింది డైరెక్ట‌ర్ జోయా అక్త‌ర్. దీంతో గ‌ల్లీబాయ్ సినిమా క‌థ‌ అంద‌రికీ తెలిసిందే అయినా విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

అయితే తెలుగులో జోయా అక్త‌ర్ రేంజ్‌లో డీల్ చేసే డైరెక్ట‌ర్ చేతిలో ఈ సినిమా ప‌డాలి.. అలాగే ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకోద‌గ్గ న‌ట‌న చూపించ‌ని తేజూ ఈ సినిమా ద‌రిదాపుల‌కు కూడా వెళ్ళ‌కూడ‌దు.. కానీ సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం అవుతున్న‌ట్టు నిజంగానే ఈ సినిమాలో న‌టిస్తే.. తేజూకి మ‌రో ప్లాప్ రెడీ అని సినీ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.