పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా నేనే గెలుస్తా: సాయి కుమార్

Tuesday, May 1st, 2018, 05:52:27 PM IST

కర్ణాటక ఎలక్షన్ లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో నేతలంతా ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఎండల్లో కూడా ప్రచారాలను చేసేస్తున్నారు. సర్వేల ప్రకారం మళ్లీ అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంతా ఒక అంచనాకు వచ్చారు. అయినా కూడా బీజేపీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాంగ్రెస్ చేసిన పొరపాట్లను ప్రజల ముందు ఉంచేందుకు తెగ ప్రయత్నిస్తోంది. ఇక బాగేపల్లి నియోజకవర్గం నుంచి సినీ నటుడు సాయి కుమార్ బీజేపీ తరపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రచారంలో అయన కూడా తన మాటల తూటాలను బాగానే పేలుస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరును కూడా అక్కడ ప్రచారంలో వాడటం హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఎలక్షన్ లో నా విజయం ఖాయం. సాక్షాత్తు పవన్ కల్యాణ్ గారు వచ్చి ప్రచారం చేసినా … ఆయనకు కోసం స్పెషల్ గా కౌంటర్లు సిద్ధంగా ఉన్నాయని ఎవరు వచ్చినా విజయం నాదే అని సాయి కుమార్ కామెంట్ చేశారు. బాగేపల్లి నియోజకవర్గంలో తెలుగువారు అధికంగా ఉండడంతో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సాయి కుమార్ ఆశాబావం వ్యక్తం చేశారు.

Comments