సాయి కుమార్ కి ఊహించని దెబ్బ.. డిపాజిట్లు గల్లంతు!

Tuesday, May 15th, 2018, 01:56:09 PM IST

డైలాగ్ కింగ్ సాయి కుమార్ కన్నడికులకంటే ఎంతో అభిమానమని అందరికి తెలిసిందే. ఆయనకు అక్కడ అభిమానులు చాలానే ఉన్నారు. దీంతో భారత జనతా పార్టీ ఆయనను కర్ణాటక ఎలక్షన్స్ లో బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన బాగేపల్లి నియోజక వర్గం నుంచి ఆయన ఎన్నికల్లో బరిలోకి దిగారు. ప్రచారంలో సాయి కుమార్ తప్పకుండా తామే గెలుస్తామని చెప్పారు.

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేసినా గెలుపు నాదే అని కౌంటర్లు వేయడం వంటి డైలాగులు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా సాయి కుమార్ దారుణంగా ఓటమిపాలయ్యారు. కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడం ఆశ్చర్యకరం. భాగేపల్లి నియోజక వర్గంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి అత్యధిక మెజారిటీతో సాయి కుమార్ పై గెలిచారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేక నాలుగో స్థానంలో నిలిచారు. రెండు మూడు స్థానాలలో సీపీఎం, జేడీఎస్ లు నిలిచాయి. గతంలో 2008 ఎన్నికల్లో కూడా సాయి కుమార్ ఇదే నియోజకవర్గం నుంచి ఓటమి చెందిన సంగతి తెలిసిందే.