టాలీవుడ్ ట్రెండింగ్ లీక్స్.. సాయిప‌ల్లవి ఇది నిజ‌మేనా..?

Wednesday, November 21st, 2018, 01:24:48 PM IST

ఫిదా చిత్రంలో భానుమ‌తిగా న‌టించి తెలుగు సినీ అభిమానుల్లో సూప‌ర్ క్రేజ్ సంపాదించిన సాయిప‌ల్ల‌వికి ఆ మ‌ధ్య వ‌రుస ఆఫ‌ర్లు ప‌ల‌క‌రించాయి. అయితే ఈ అమ్మ‌డు త‌న పాత్ర‌కు ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే న‌టిస్తూ చాలా అవ‌కాశాలు వ‌దులుకుంది. ఇక తాజాగా తెలుగులో శ‌ర్వానంద్‌తో ప‌డి ప‌డి లేచె మ‌న‌సు చిత్రంలో న‌టిస్తోంది ఈ నేచుర‌ల్ భామ‌. ఇక ఇప్ప‌టికే విడుద‌లైన టీజర్ చూస్తే ప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్ ఇంట్ర‌స్టింగానే ఉంది.

అయితే ఇక్క‌డ అసలు మ్యాట‌ర్ ఏంటంటే రాఘవపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ పడి ప‌డి లేచె మ‌న‌సు చిత్రం చాలా కాలంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అయితే తాజా కొన్ని సీన్లు రీ షూట్ చేయాల‌ని భావిస్తున్నార‌ట ఆ చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు. దీంతో డేట్స్ కోసం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించ‌గా.. రీ షూట్ డేస్ కోసం కూడా రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌నే వార్త సినీ వ‌ర్గాల్లో స్ప్రెడ్ అయ్యింది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియ‌దు సాయిప‌ల్ల‌వి డ‌బ్బుల విష‌యంలో ముక్కుపిండి వ‌సూలు చేస్తోంద‌నే న్యూస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక గ‌తంలో కూడా సాయిప‌ల్ల‌వి పై రూమ‌ర్స్ తెగ చక్క‌ర్లు కొట్టాయి. నానితో ఎంసీఏ చిత్రం షూటింగ్ టైమ్‌లో కూడా నానితో గొడ‌వ పెట్టుకుంద‌ని, చిత్ర యూనిట్‌కు చుక్క‌లు చూపించింద‌ని, దీంతో దిల్ రాజు కూడా ప‌ల్ల‌వి పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడ‌ని టాక్ వచ్చింది. అయితే ఆ త‌ర్వాత దిల్ రాజు స్పందించి ఆ రూమ‌ర్స్ అబ‌ద్ధ‌మ‌ని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మ‌రోసారి సాయిప‌ల్ల‌వి పై నెగిటీవ్ రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. మ‌రి నిజంగానే ప‌ల్ల‌వి డబ్బుల విష‌యంలో డిమాండ్ చేసిందో లేక ఇవి కూడా రూమ‌ర్సేనా అనే విష‌యం తెలియాలంటే సాయిప‌ల్ల‌వి గానీ చిత్ర యూనిట్ గానీ స్పందిస్తే కాని తెలియ‌దు.